2024 భారత సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు

భారత ప్రస్తుత 17వ లోకసభ 2024 జూన్ 16న ముగియనుంది. ఆ రోజుకు 18వ లోకసభ ఏర్పాటుకు జరుగవలసిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును, భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 16న ప్రకటించింది. భారతదేశం లోని 543 లోకసభ నియోజక వర్గాలకు ఎన్నికలు  ఏడు విడుతలుగా జరపటానికి నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు అంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా  4 రాష్ట్రాల శాసనసభల  కాలపరిమితి ముగియనుండటంతో అన్నిటికీ ఎన్నికలు నిర్వహించటానికి భాలత ఎన్నికలు సంఘం నిర్ణయం తీసుకుంది.నిన్నటినుండి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినట్లుగా ప్రకటించింది.దేశంలోని రాష్ట్రాలలో వివిధ కారణాల వల్ల ఖాళీలు ఏర్పడిన 26 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరపటానికి నిర్ణయం తీసుకుంది. జూన్ 4 న ఎన్నికల లెక్కింపు కార్యక్రమం జరిగింది.ఎన్నికలు ఫలితాలు అదే రోజు ప్రకటిస్తారు.

ఎన్నికలు షెడ్యూలు

  • నామినేషన్ల గడువు:25.04.2024
  • నామినేషన్లు పరిశీలన:26.04.2024
  • ఉపసంహరణ గడువు:29.04.2024
  • పోలింగు తేదీ:13.05.2024
  • ఓట్ల లెక్కింపు;04,06.2024

గమనిక:ఇందులోని వోటింగ్ మెషిన్ వికీకామన్స్ నుండి సేకరించబడింది

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …