శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ చరిత్ర (పొనుగుపాడు)

మొదట అంకురార్పణ.

మొదట పూర్వం వంద సంవత్సరంల క్రిందట ఈ ఆలయం నిర్మించక ముందు ఆలయం నిర్మించిన స్థలం బహిరంగ ప్రదేశంగా ఉండేది. ఆ స్థలంలోనే కొంత భాగంలో దిగుడు బావి ఉండేది. కాలక్రమేణా తరువాత ఆబావి గిలకల బావిగా నిర్మించబడింది. ఆ బావి మొన్న మొన్నటి వరకు ఉండేది. వాడుక లేక నీరు కలుషితమై నిర్వహణ లేనందున శిధిలమై పూడిక ఏర్పడినది.

ప్రస్తుతం ఆ స్థలం ఆలయ జీర్ణోద్దరణ నిర్మాణంకు ఉపయోగించబడింది. ఆ బావికి ఎదురుగా కొంత ప్రదేశం ‘ఖాళీ’ గా ఉండేది. ఆ కాలంలో బొప్పూడి సుబ్రమణ్యం అనే వారు ఈ గ్రామంలో నివశించే వారు. ఇప్పడైతే బొప్పూడి వారు గ్రామంలో ఎవ్వరూ లేరు.ఆయన దైవభక్తి పరాయణుడు.

ఆ ఖాళీగా ఉన్న ప్రదేశంలో బొప్పూడి సుబ్రమణ్యం, దార్ల శ్రీశైలం, మోడేపల్లి క్రిష్ణయ్య, వేమూరి దేశయ్య, బొమ్మినేని బిక్షాలు, తూబాటి నాగభూషణం, దమ్మాటి చంద్రయ్య, కుంటి నాగమ్మ(ఇంటి పేరు తెలియదు) అను వారు మొదట చిన్న పందిరి వేసి, విబూదిపండును శివలింగంగా అమర్చి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రంను పందిరిలో తగిలించి ఆరాధించేవారు. ప్రతి రోజు బొప్పూడి సుబ్రమణ్యం ఉదయం, సాయంత్రం అక్కడ బావి లో స్నానం చేసి దీపారాధన చేసేవారు.ప్రతి సోమవారం పైన తెలిపిన వారందరూ బ్రహ్మేంద్రస్వామి వారి భజనలో పాల్గొని భజన చేసేవారు.

ఆలయ నిర్మాణంనకు నాంది

ఈ విషయం మనం తెలుసుకోవాలంటే రెండు వందల సంవత్సరాల క్రిందటి కొంగర ఇంటి పేరు వంశీయుల పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలి.

పొనుగుపాడు గ్రామంలో ‘కొంగర’ ఇంటి పేరు వంశీయుల మూల  పురుషుడు బసవయ్య. ఈయన 19వ శతాబ్దం ఆరంభంలో పొనుగుపాడు గ్రామంలో నివసించే వారు. బసవయ్య రెండవ ముది మనవడు నరసయ్య.ఈయనకు ఇద్దరు బార్యలు.మొదటి భార్య సంతానంలో ప్రధమ కుమార్డు రాఘవయ్య. ఆయన భార్య చిన్న అచ్చమ్మ.

గ్రామాల్లో పూర్వపు నమ్మకాలు

పూర్వం గ్రామాలలో దాదాపుగా ప్రతి కుటుంబానికి ఆవులు, ఎద్దులు పశు సంపద ఎక్కువగా ఉండేది. రాఘవయ్య, చిన్నఅచ్చమ్మ దంపతులు జీవనం సాగించే కాలం (1920 ప్రాంతం) లో పశువులకు తీవ్రమైన అంటు వ్యాధులు సోకినవి. పశువులు ఎక్కువుగా మృత్యువాత పడే సమయంలో సరిగా వైద్య సదుపాయం లేనందున విధిలేక వ్యాధులు పూర్తిగా తగ్గితే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం నిర్మిస్తామని మ్రొక్కుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే గ్రామంలో వ్యాధులు పూర్తిగా తగ్గుమొఖం పట్టినవి. దాని పర్వవసానంగా “శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం” అనే నామధేయంతో మొదట చిన్న ఆలయం ను ప్రధాన వీధిలో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక వైపు మనం పైన చెప్పుకున్న ఖాళీ స్థలంలో సుమారు 100 చ.గ.ల.విస్తీర్ణంలో నిర్మించబడింది.

పూర్వపు దేవాలయం
గుర్రం శేషారాయుడు.

ఆలయంలో ప్రతిష్ఠించిన స్వామివారి శివలింగం (సాలగ్రాము) ను కాశీ (వారణాశి) నుండి తీసుకొని వచ్చి, శివలింగంతో పాటు పార్వతీదేవి, వినాయకుడు, నంది, విగ్రహాలతో 1921 వ సంవత్సరం ఆ ప్రాంతలో ప్రతిష్ఠ చేసినట్లుగా ప్రస్తుత ఆలయ ధర్మకర్తలలో ఒకరైన కామినేని రామారావు, వారి తండ్రి కీ.శే.పెద రాఘవయ్యకు ముఖ్య సన్నిహితుడు, గ్రామంలో ప్రస్తుతం ఉన్న పెద్ద వారిలో ఒకరైన గుర్రం శేషారాయుడు మరి కొంత మంది పెద్ద వారి ద్వారా తెలుస్తుంది. కొంగర ఇంటి పేరు గల వంశీయులు నిర్మించినందున పూర్వం నుండి వాడుకలో “కొంగరోరి గుడి” అని వ్యవహరిస్తుంటారు.

గ్రామస్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి

తరువాత కొంత కాలానికి ఆ ఆలయంను మోడేపల్లి కిష్టమ్మ, లక్కవరపు రామలింగాచారి, దార్ల శ్రీశైలం, వేమూరి దేశయ్య,వీరయ్య, తూబాటి నాగభూషణం, గుర్రం అప్పయ్య తదితర గ్రామస్తుల సహకారంతో ఆలయ ధర్మకర్తలు కొంత మేరకు దేవాలయంను అభివృద్ధి చేసారు.

దేవాలయ ప్రతిష్ఠ  జరిగిన నాటి నుండి ధూప, దీప, నిత్య నైవేధ్యం, అర్చకత్వం, ఉరేగింపు, మేళం తదితర కార్యక్రమాలు నిరాటంకముగా జరుగుటకు రాఘవయ్య, చిన్నఅచ్చమ్మ దంపతులు డి.నెం.292/2రు లో య.4.74.శెంట్లు వారి స్వంత భూమి దేవాలయంనకు కైంకర్యం చేసారు. అప్పటి నుండి రాఘవయ్య, చిన్నఅచ్చమ్మ దంపతులు ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరించారు. 

కీ.శే.కోటయ్యాచారి, భార్య ఈశ్వరమ్మ

విశ్వబ్రాహ్మణ వంశీయులుకు చెందిన మాగులూరి కోటయ్యాచారికి మొదటి పూజారిగా ఆలయ అర్చకత్వ భాధ్యతలు ఒప్పగించారు.

రాఘవయ్య, చిన్నఅచ్చమ్మ దంపతులుకు మగ సంతానం లేదు. వృద్దాప్యదశకు చేరువైన సమయం లో మగ సంతానం లేనందున బావమరిది కామినేని నానయ్యను తన ఆస్తిపాస్తులకు వారసుడుగా స్వీకరించారు.ఈయన సంతానం ఇద్దరు కుమారులు రామయ్య, పాపయ్య.

రాఘవయ్య, చిన్నఅచ్చమ్మ దంపతులు మరణానంతరం మేనల్లుళ్ళు కామినేని రామయ్య, పాపయ్య వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరించారు.

చిన రాఘవయ్య
పెద రాఘవయ్య

కామినేని రామయ్య తదనంతరం వారి కుమారులు నరసయ్య, పెద రాఘవయ్య. అలాగే పాపయ్య మరణానంతరం కుమార్డు చిన రాఘవయ్య వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరించారు. పెద్ద మేనల్లుడు రామయ్య పెద్ద కుమార్డు నరసయ్య. భార్య సైదమ్మ. ఈ దంపతులకు సంతానం లేదు. రెండువ కుమార్డు పెద రాఘవయ్య.(పై వారిలో మొదటి వారు) ఆయన భార్య పెద్దమ్మాయి.ఈ దంపతుల కుమారులు రామారావు, బ్రహ్మానందం.

అలాగే చిన మేనల్లుడు  పాపయ్య ఏకైక కుమార్డు చిన రాఘవయ్య. (పై వారిలో రెండవ వారు) వీరి భార్య కోటి రత్నమ్మ. ఈ దంపతుల కుమారులు పాపారావు, నరసింహారావు. రెండువ కుమార్డు నరసింహారావు అవివాహితుడుగా చనిపోయాడు. ప్రస్తుత వంశపారంపర్య దర్మకర్తలుగా పెద రాఘవయ్య కుమారుడు రామారావు, బ్రహ్మానందం, చిన రాఘవయ్య కుమారుడు పాపారావు లు కొనసాగుచున్నారు. ప్రస్తుత ఆలయ పూజారిగా మాగులూరి కోటయ్యాచారి కుమారుడు నాగభూషణాచారి పర్వేక్షణలో ఉమామహేశ్వరరావు (కుమారుడు) కొనసాగుచున్నారు. 

జీర్ణోద్ధరణ కార్యక్రమం

కాలక్రమేణ దేవాలయ ప్రాంగణం పల్లంగా ఉండి వర్షపు నీరు ఆలయంలోనికి ప్రవేశించి శిధిలావస్ధకు చేరువైనది.గ్రామస్థుల సహకారంతో ప్రస్తుత వంశపారంపర్య ధర్మకర్తలు కామినేని రామారావు, బ్రహ్మానందం,పాపారావులు జీర్ణోద్ధరణ చేయతలంచి ది.29.08.2013న శంఖుస్థాపన కార్యక్రమం గావించారు.పూర్వపు ఆలయ నిర్మాణం సుమారు 100 చ.గ.లలో స్థలంలో నిర్మించబడింది.ప్రస్తుత స్థలం జీర్ణోద్ధరణ దేవాలయంనకు సరిపోదని భావించి రు.2.00 లక్షలు రుపాయలు హెచ్చించి అదనంగా మరొక 75 చ.గ. ల స్దలంను విక్రయం ద్వారా జీర్ణోద్దరణ కార్యక్రమం చేపట్టబడినది.

జీర్ణోద్ధరణ దేవాలయ నిర్మాణంనకు సుమారు 60 లక్షలు హెచ్చించబడివి.ఆలయ నిర్మాణంలకు గ్రామస్తుల సహకారం, వంశ పారంపర్య ధర్మకర్తల కృషి ఎంతో ఉంది.దేవాలయ నిర్మాణం ఆగమశాస్త్ర ప్రకారం అన్ని హంగులుతో పూర్తి చేయబడింది.నూతనంగా నిర్మించిన దేవాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు మహాబలేశ్వరం నుండి రు.2.50.లక్షలు హెచ్చించి తీసుకు రాబడినవి. జీవ ధ్వజస్తంబం మూలం రు.3.60 లక్షలు హెచ్చించి  మహారాష్ట్ర (బలర్షా) నుండి తీసుకుని రాబడింది. లోగడ కాశీ నుండి తీసుకు వచ్చిన శివలింగంతో పాటు నూతనంగా పానువట్టం,శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంధ్రస్వామి, శ్రీ గోవిందమాంబ, గణపతి, శ్రీ ఆంజనేయస్వామి, నందీశ్వరుడు విగ్రహాల మరియు నవగ్రహాలు ప్రతిష్ఠ కార్యక్రమాలు మహోత్సవం ది.08.05.2017 న జరిగింది. విగ్రహాలు, ధ్వజస్తంబం ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలు ది.08.05.2017 న ఉదయం ఘనంగా నిర్వహించారు.  

దేవాలయ జర్ణోద్దరణ కార్యక్రమం చేపట్టినప్పటి నుండి వంశపారంపర్య ధర్మకర్తలలో ఒకరైన కామినేని రామారావు (విశ్రాంత ఉద్యోగి) కృషి చాలా ఉంది.ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ద పాడ్యమి (ఉగాది పర్వదినాన) నాడు ఉత్సవాలు జరుపుట పూర్వం నుండి అనవాయితి. ఆరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భజన ఏకాహం/శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటకం కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్రతి శుక్రవారం ఆలయంలో భజన కార్యక్రమం జరుగుతుంది.

వీర బ్రహ్మేంద్రస్వామివారి జండా.

పొనుగుపాడు గ్రామానికి చెందిన వేమూరి వీరయ్య ఈ ఆలయంనకు శ్రీ వీరబ్రహ్మేంధ్రస్వామి వారి జండా అనే పేరుపై 1960 ఆ ప్రాంతంలో జండా బహుకరించారు. అప్పటి నుండి చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) రోజు స్వామివారి ఊరేగింపుతోపాటు  వేమూరి వీరయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జండా ఊరేగింపు ప్రతి సంవత్సరం జరుగుతుంది.

ప్రస్తుత ఆలయ ధర్మకర్తలు రామారావు,బ్రహ్మానందం,పాపారావు,పూజారి ఉమామహేశ్వరరావు

పున:ప్రతిష్ఠ

జీర్ణోద్ధరణ దేవాలయ నిర్మాణంనకు సుమారు 60 లక్షల రుపాయల హెచ్చించ బడినవి.ఆలయ నిర్మాణంనకు గ్రామస్తుల సహకారం, వంశ పారంపర్య ఆలయ ధర్మకర్తలు కృషి ఎంతో ఉంది. అన్ని హంగులుతో ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తిచేయబడింది. గ్రామస్తుల సహకారంతో వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో ది.(08.05.2017) న పున:ప్రతిష్ఠ  కార్యక్రమ మహోత్సవం జరిగింది.

సర్వేజనా:సుఖినోభవంతు.

శుభం.

Check Also

భారతదేశంలోని లోకసభ నియోజకవర్గాలు

constituencies of the Lok Sabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *